గడువులోగా గోదావరి పుష్కరాల పనులు పూర్తి కావాలి : దేవాదాయ కమిషనర్ హనుమంతరావు

బాసరలో పుష్కరాల ఏర్పాట్లను కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పరిశీలించి పనుల పురోగతిపై సమీక్షించారు.
Basara Godavari Pushkaralu
Commissioner Hanumantha Rao and Collector Bhavesh Mishra inspected the arrangements for the Pushkaralu in Basara
Published on: 

ప్రభాత ఉదయం, ముదోల్: గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రాతో కలిసి బాసరలో పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. పనుల పురోగతిని కలెక్టర్‌ ఆయనకు వివరించారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా పుష్కర ఘాట్లను నిర్మించాలని కమిషనర్‌ సూచించారు. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు వచ్చే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పార్కింగ్‌ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పురోగతి వివరాలను తమకు తెలియజేయాలని సూచించారు. అంతకుముందు కమిషనర్‌, కలెక్టర్‌, ఇతర అధికారులు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాథోడ్‌ రమేశ్‌, భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్‌, ఆలయ ఈవో అంజనా దేవి, తహశీల్దార్‌ పవన్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.