డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా.. దంపతుల దుర్మరణం

సంగారెడ్డి జిల్లా కంది శివారులో సోమవారం అర్ధరాత్రి కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నర్సింలు, మౌనిక దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా.. దంపతుల దుర్మరణం
Published on: 

ప్రభాత ఉదయం, సంగారెడ్డి : అతివేగం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వివరాల ప్రకారం... సోమవారం అర్థరాత్రి సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నర్సింలు (40), భార్య మౌనిక (33) మృతి చెందారు. శంకర్‌పల్లి మండలానికి చెందిన నర్సింలు మౌనికతో కలిసి కారులో శంకర్‌పల్లి నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా, కంది శివారులో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్​ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు.