పంట రుణాల వడ్డీ మాఫీ చేయాలి : సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి

తెలంగాణ రైతుల పంట రుణాల రీషెడ్యూల్, వడ్డీ మాఫీ చేయాలని సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
CPI leader Palla Venkat Reddy
దేవరకొండలో రైతుల పంట రుణాల రీషెడ్యూల్, వడ్డీ మాఫీ కోరుతూ మాట్లాడుతున్న సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, దేవరకొండ : రాష్ట్రంలోని రైతుల పంట రుణాల రీ షెడ్యూల్​తోపాటు వడ్డీ మాఫీ  చేయాలని  సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి  పల్లా వెంకట్​రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎల్​నినో ప్రభావంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘రేషన్ కార్డు ఉన్న వారికి అదనంగా 10 కిలోల బియ్యం, పప్పులు అందజేయాలి. ఉపాధి హామీ పథకం కింద కూలీ పెంచి అందరికీ జాబ్ కార్డులు అందజేయాలి. నల్లగొండ జిల్లా లోని అన్ని మండలాలను  కరువు మండలాలుగా  ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు, సీపీఐ నాయకులు పల్లా నరసింహారెడ్డి, దేవేందర్​రెడ్డి, బుచ్చిరెడ్డి, జయరాములు మైనొద్దీన్​, సుదర్శన్​రెడ్డి, వెంకటయ్య, రామస్వామి, రామాంజనేయులు, వెంకట్రాములు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.