పంటల నష్టం సర్వే షురూ.. కామారెడ్డి జిల్లాలో అంచనా వేస్తున్న అధికారులు

కరువు మండలాల్లో ఎల్​నినో ప్రభావంతో ఎండిన పంటల వివరాలను కామారెడ్డి జిల్లా అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ నెల 10 వరకు సర్వే కొనసాగనుంది.
Agricultural officers conducting a field survey of drought-affected paddy and cotton crops in Kamareddy
Published on: 

ప్రభాత ఉదయం, కామారెడ్డి : ఎల్​నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కామారెడ్డి జిల్లాలో అనేక పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలను ప్రకటించింది. సర్కార్​ ఆదేశాలతో అధికారులు సోమవారం  నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. మొదట కరువు మండలాలు, ఆ తర్వాత జాబితాలో లేని మండలాల్లోనూ ఎండిన పంటల వివరాలు సేకరిస్తున్నారు. జుక్కల్, పెద్దకొడప్గల్, సదాశివనగర్, మహ్మద్​నగర్​ మండలాల్లో ఏఈవోలు ఎండిన పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం 33 శాతం కంటే ఎక్కువ నష్టం వాటిల్లిన పంటల వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేస్తున్నారు. రైతు వివరాలు, సర్వే నంబర్, ఎంతమేర పంట ఎండింది, ఏ పంట అనేది నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా వరి 1,043 ఎకరాలు, పత్తి 476 ఎకరాల్లో ఎండిపోయినట్లు ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ నెల 10 వరకు సర్వే కొనసాగనున్నది.