

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నిందితుల ఆస్తులపై ఈగల్ ఫోర్స్, సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. 2025లో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కొకైన్ అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్న శ్రీరామ్ అనంత్‌కుమార్, పేరూరు వీరబాబు నుంచి 107.4 గ్రాముల కొకైన్, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు సంబంధించిన సుమారు రూ.2 కోట్ల మార్కెట్ విలువ కలిగిన రెండు ఫ్లాట్లను అధికారులు గుర్తించారు. వీటిని మంగళవారం జప్తు చేసే ప్రక్రియ చేపట్టారు. అలాగే నిందితుడు, అతడి కుటుంబ సభ్యులకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.43 వేల నగదును సీజ్ చేశారు.