సాగుపై ఎల్ నినో పిడుగు

El Nino Impact Warangal Agriculture
El Nino Impact Warangal Agriculture
Published on: 

ప్రభాత ఉదయం ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగంపై ఎల్ నినో ఎఫెక్ట్ కనిపిస్తున్నది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు సంక్షోభంలో పడింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో  రాష్ట్రంలో 17శాతం, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సగటున 21.5 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో  లోటు వర్షపాతం నమోదైంది. ఇక 22 జిల్లాల్లో 76 శాతం, మిగిలిన 10 జిల్లాల్లో పంటల సాగు ఆశాజనకంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎల్ నినో కారణంగా దాదాపు 235 మండలాల్లో  కరువు పరిస్థితులు నెలకొన్నట్లు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ప్రకటించింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

ఉమ్మడి జిల్లా పరిధిలో..

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కొంత ఆశాజనకంగా కనిపించినా, ఆ తర్వాత రెండు నెలలు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్‌లో సానుకూల వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. పంటలను కాపాడుకోవడానికి రైతులు అనేక పాట్లు పడాల్సి వచ్చింది. పంటలు చేతికొచ్చే సమయానికి కూడా వానల జాడే లేకుండా పోయింది.

జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు విస్తీర్ణం తగ్గింది. 15.93 లక్షల ఎకరాలకు గానూ 14,48,052 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే దాదాపు 1. 50లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఇందులో కూడా వర్షాభావ పరిస్థితుల కారణంగా పలు పంటలు దెబ్బతిన్నాయి. 

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సాగు విస్తీర్ణం(ఎకరాల్లో)