‘ఫార్ములా ఈ-రేస్’ విచారణకు హాజరుకాని కేటీఆర్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ- రేసింగ్ నిధుల కేటాయింపుల వివాదానికి సంబంధించిన కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గైర్హాజరయ్యారు.
‘ఫార్ములా ఈ-రేస్’ విచారణకు హాజరుకాని కేటీఆర్
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ :  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ- రేసింగ్ నిధుల కేటాయింపుల వివాదానికి సంబంధించిన కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గైర్హాజరయ్యారు. నాంపల్లిలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ శుక్రవారం మొదలైంది. కేసులో నిందితులైన అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్‌ రెడ్డి, గోవెడ కిరణ్ మల్లేశ్వర్‌రావు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుకు హాజరుకాలేదని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. దానిని న్యాయస్థానం అనుమతించింది. రెండు వర్గాల వాదనలను విన్న కోర్టు ఈ కేసు విచారణను వచ్చేనెల 4వ తేదీకి వాయిదా వేసింది. మరో వైపు పాస్‌పోర్ట్ జప్తునకు సంబంధించి నోటీసులపై రీజినల్ ఫాస్‌పోర్ట్ ఆఫీసర్, ఏసీబీ డీజీ, కేంద్ర ప్రభుత్వంపై కూడా కేటీఆర్  హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దానిపై 6వ తేదీన హైకోర్టు విచారణ చెపట్టనుంది.