

ప్రభాత ఉదయం, గజ్వేల్ : గోదావరిఖనికి చెందిన 15 మంది యువకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు సైకిల్ యాత్ర చేపట్టారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమైన యాత్ర మంగళవారం గజ్వేల్‌కు చేరుకుంది. గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవి, వైస్ చైర్ పర్సన్ పద్మాభాయి నర్సింగ్, మండల పార్టీ అధ్యక్షుడు నవాజ్ మీరా, కౌన్సిలర్లు తదితరులు యువకులకు స్వాగతం పలికారు. గోదావరిఖనికి చెందిన మాజీ కౌన్సిలర్ బొడ్డు రవీందర్‌తో పాటు ఉప్పు రాజ్‌కుమార్, లక్ష్మణ్ గౌడ్, కె.బాబు, సర్వేశ్, అనిల్ కుమార్, నవీన్, శ్రీను, రాకేష్ తదితరులు సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా తమ యాత్ర అనుభావాలను ఆయనతో పంచుకోనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలంగా పరిపాలన అందించారని యువకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు అభిప్రాయపడ్డారు.