గుక్కెడు నీటి కోసం గోస.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన!

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు నిరసనకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
Gullakota village drinking water shortage
Gullakota village drinking water shortage
Published on: 

ప్రభాత ఉదయం, ధర్మపురి : తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు నిరసనకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గుల్లకోట ఎస్సీ కాలనీ వాసులు కొన్ని రోజులుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. కాలనీలో కొన్ని రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి కాలనీకి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, తమ ఇబ్బందులను తొలగించాలని సంబంధిత అధికారులను కోరారు.