

ప్రభాత ఉదయం, బోథు: మద్యం తాగి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బాధ్యతల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇచ్చోడ మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి మంగళవారం బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జిగా సురేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానోపాధ్యాయుడిని తిరిగి విధుల్లో తీసుకోవాలని, తమ సార్ తమకే కావాలంటూ విద్యార్థులు నినదించారు.