జీతం తక్కువ.. పని భారం ఎక్కువ..ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన

తక్కువ వేతనాలు, అధిక పనిభారాన్ని నిరసిస్తూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. ఉద్యోగుల రెగ్యులరైజ్, బోనస్‌, పెండింగ్ పీఆర్సీ ఎరియర్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జీతం తక్కువ.. పని భారం ఎక్కువ..ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన
Published on: 

ప్రభాత ఉదయం, జగిత్యాల: తక్కువ వేతనాలు, అధిక పనిభారాన్ని నిరసిస్తూ నేషనల్ హెల్త్ మిషన్ఎ (న్‌హెచ్‌ఎం) ఉద్యోగులు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ పనులు చేయాల్సి వస్తోందన్నారు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు బోనస్‌, లాయల్టీ చెల్లింపులు, పెండింగ్ పీఆర్సీ ఎరియర్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్‌ 60, 1195 ప్రకారం పెంచిన వేతనాలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.