బడి బూట్లు.. నడిస్తే పాట్లు

విద్యార్థులకు ఉపయోగపడని వైనం
Telangana Government Oversize Shoe Distribution
Telangana Government Oversize Shoe Distribution
Published on: 

ప్రభాత ఉదయం, అలంపూర్:  మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ఎన్నో కోణాల్లో ఆలోచిస్తాం. తగిన జాగ్రత్తలు తీసుకుని వినియోగానికి వీలుగా మన్నిక, చక్కగా ఉన్నవి కొంటాం. ఇందుకు భిన్నంగా అధికారులు చేసిన నిర్వాకమిది. ప్రజాధనం కదా అందుకే అలుసు. దానికి సార్థకత చేకూర్చాలన్న తపన లేదనడానికి సర్కారు బడుల్లో పంపిణీ చేసిన బూట్ల తీరే నిదర్శనం.

జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల బాధ్యతారాహిత్యం కారణంగా పిల్లలు నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఒకటో తరగతి చదివే చిన్నారులకు, ఐదో తరగతి విద్యార్థుల సైజు బూట్లను పంపిణీ చేశారు. రాజోళి మండలం తుమ్మిళ్ల ప్రాథమిక పాఠశాలలో పంపిణీ చేసిన బూట్లతో విద్యార్థులు కనీసం నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితి. కొందరైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ‘‘మా పిల్లలు పెద్ద బూట్లు వేసుకొని ఎలా నడవాలి? కిందపడి గాయపడితే బాధ్యత ఎవరిది?’’ అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

నాసిరకం.. ఇష్టారాజ్యం

కేవలం ఒక్క తుమ్మిళ్ల పాఠశాల మాత్రమే కాదు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. విద్యార్థుల వయసు, పాదాల సైజులతో సంబంధం లేకుండా గుత్తేదారు ఇష్టారాజ్యంగా అందరికీ ఒకే రకమైన బూట్లు పంపిణీ చేశారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి.. గుత్తేదారుపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తగిన సైజులో బూట్లను పంపిణీ చేసి చిన్నారుల కష్టాలను తొలగించాలని వారు కోరుతున్నారు.

జిల్లాలో ఇలా..

* ప్రభుత్వ పాఠశాలలు: 280

* 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు: 28,500