పాము కాటుతో మహిళ మృతి

పత్తి ఏరుతుండగా ఘటన
Jogulamba gadwal woman dies due to snake bite in cotton field
Jogulamba gadwal woman dies due to snake bite in cotton field
Published on: 

ప్రభాత ఉదయం, అల్లంపూర్ : పంట చేనులో పత్తి ఏరుతుండగా పాము కాటుకు గురై ఓ మహిళా కూలీ ప్రాణాలు కోల్పోయింది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాలదిన్నె గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ​స్థానికులు కథనం ప్రకారం, గోపాలదిన్నె గ్రామానికి చెందిన లలిత(33) రోజువారీ కూలీ పనుల నిమిత్తం వ్యవసాయ పొలంలో పత్తి ఏరేందుకు వెళ్ళింది. చెట్ల పొదలమాటున ఉన్న విషసర్పం ఆమెను హఠాత్తుగా కాటు వేసింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల రైతులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి వైద్య చికిత్స నిమిత్తం ఆమెను గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె శరీరంలోకి విషం వేగంగా వ్యాపించడంతో మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచింది. మృతురాలికి భర్త గోపాల్, కుమార్తె నిస్సీ, కుమారుడు అభిషేక్ ఉన్నారు. ఊహించని ఘటనతో గోపాలదిన్నె గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.