లారీ కింద పడి వ్యక్తి మృతి

కాగజ్‌నగర్‌లో లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతుంది.
Kagaznagar lorry accident death
Published on: 

ప్రభాత ఉదయం, కాగజ్‌నగర్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో సోమవారం ఓ వ్యక్తి లారీ కింద పడి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బాలభారతి స్కూల్ వెనుక ఉన్న ఎస్పీం కంపెనీకి కర్ర లోడ్‌తో వస్తున్న లారీ కింద గుర్తు తెలియని వ్యక్తి పడి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరిన పోలీసులు, ఎస్పీఎం ప్రతినిధులతో కలిసి  పంచనామా చేయకుండానే ఆఘమేఘాల మీద మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మృతదేహం పక్కన ఓ సంచి పడి ఉన్నా కనీసం దానిని చూడకపోవడం గమనార్హం. మృతుడి మెదడు సహా కొన్ని శరీరభాగాలు అక్కడే మట్టిలో పడిపోగా, వాటిని తీసేందుకూ పోలీసులు, ఎస్పీఎం ప్రతినిధులు చొరవ చూపలేదు. ఘటనపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ.. అంతా పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటారని చెప్పగా, టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్ మాత్రం ప్రస్తుతానికి ఏమీ తెలియదని, ముందుగా మృతదేహాన్ని పంపించామని తెలిపారు.