‘గ్రాడ్యుయేట్’ ఓటరు నమోదును పొడిగించండి : టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంచాలని కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేశారు.
Kalvakuntla Kavitha
కల్వకుంట్ల కవిత
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్‌ భవన్‌లో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జెన్‌ జీ యువత, గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ప్రతీ ఎన్నికల సమయంలో ఓటరు నమోదు అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారుతోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడా విద్యాసంస్థల యజమానులు పోటీకి దిగుతూ, తమ విద్యాసంస్థల్లోనే పెద్ద సంఖ్యలో ఓటరు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై కూడా ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించాలని కోరారు.

పార్టీ రిజిస్ట్రేషన్‌కు సహకరించాలని వినతి..

తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉందని, ముందుకు సాగేలా సహకరించాలని కవిత సీఈవోను కోరారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలకు దీటుగా ప్రజా సమస్యలపై తాము పోరాడుతున్నామన్నారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ అన్ని విభాగాల కమిటీలను ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.