చేతికొచ్చిన పంట.. పశువులకు మేత

మెదక్ జిల్లా కన్నారం గ్రామంలో లోవోల్టేజీ, త్రీఫేజ్ విద్యుత్ కొరతతో రెండెకరాల కౌలు వరి పంట ఎండిపోవడంతో రైతు అవేజ్ తీవ్రంగా నష్టపోయాడు.
paddy crop damage due to power cuts and shortage of water in telangana
Published on: 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామానికి చెందిన అవేజ్ రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. పంట కాస్తా పొట్ట దశకు వచ్చిన సమయంలో లోవోల్టేజీ సమస్య, త్రీఫేజ్ కరెంటు కొరతతో సరిపడా నీరు అందక నాటిన పొలమంతా పూర్తిగా బీటలువారింది. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం వృథా కావడంతో చేసేది లేక సదరు రైతు ఆదివారం ఎండిపోయిన పొలంలో గేదెలను మేపాల్సి వచ్చింది.