

ప్రభాత ఉదయం, కరీంనగరం : పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. గంజాయి అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. విరివిగా అరెస్టులు జరుగుతున్నా.. విక్రేతలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటూనే ఉంటున్నారు. తాజాగా వన్‌టౌన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 1.2 కిలోల గంజాయి దొరికింది. ఉజ్వల పార్క్ సమీపంలో విజయగిరి సూర్యతేజ(26)ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సాదిక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కొంతకాలంగా గంజాయికి బానిస అయిన సూర్యతేజ.. నాగపూర్‌కు చెందిన సాదిక్ నుంచి కిలోకు రూ.25 వేల చొప్పున కొనుగోలు చేశాడు. దానిని 5 గ్రాముల చొప్పున ప్యాక్ చేసి రూ.500లకు ఒకటి చొప్పున విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. సూర్యతేజ నుంచి రెండు ఫోన్లు, మోటార్ సైకిల్, ఎలక్ర్టానిక్ వేయింగ్ మెషిన్, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వన్‌టౌన్ సీఐ రామచందర్‌రావు తెలిపారు.