

ప్రభాత ఉదయం, హైదరాబాద్: జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, తన హక్కులకు భంగం కలిగించేవిగా ఉన్నాయని కౌశిక్‌రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. వాయిస్ శాంపిల్స్ సేకరణకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ఎమ్మెల్యే కోరారు. కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ చెల్లదని పీపీ నాగేశ్వర్రావు హైకోర్టుకు నివేదించారు. రివిజన్ పిటిషన్ విచారణార్హం కాదని వాదించారు. ఇలాంటి అంశాలపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన పీపీ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు కేవలం దర్యాప్తు ప్రక్రియకు సంబంధించినవని పీపీ కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు.