చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి నీళ్లు: టీఆర్ఎస్ చీఫ్ కవిత

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని సీఎం రేవంత్‌పై కవిత ఆరోపించారు.
Kalvakuntla kavitha opposes Banakacherla project and Hindu college privatization
కల్వకుంట్ల కవిత
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్: పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ నీటి ప్రయోజనాలను రేవంత్ సర్కార్ ఏపీకి తాకట్టు పెడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. గోదావరిలో తెలంగాణకు దక్కాల్సిన 250 టీఎంసీల నీటి వాటాను చంద్రబాబుకు గురుదక్షిణగా సీఎం రేవంత్​రెడ్డి సమర్పించుకుంటున్నారని విమర్శిస్తూ బుధవారం ఎక్స్​లో ట్వీట్​ చేశారు. ఎన్​డబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలోనూ పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్​కు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించటం వారి ద్వంద్వ విధానాలను తెలియజేస్తోందన్నారు. కానీ మీడియా ముందు మాత్రం బనకచర్ల ప్రాజెక్ట్​ను వ్యతిరేకిస్తున్నట్లు పచ్చి అబద్ధాలు ఆడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరాలని డిమాండ్​ చేస్తూ ప్రధానికి లేఖ రాయాలని కవిత పేర్కొన్నారు.

 కాలేజీని ప్రైవేటు పరం చేస్తేం ఊరుకోం

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్ఠాత్మక హిందూ కాలేజీని ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని టీఆర్​ఎస్​ చీఫ్ కవిత హెచ్చరించారు. కాలేజీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు నెలన్నర రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు చేస్తున్న ఆందోళనకు కవిత మద్దతు తెలిపారు. బుధవారం విద్యార్థులను కలిసిన ఆమె వారికి సంఘీభావం తెలియజేశారు. కళాశాల నిర్వహణకు ప్రైవేటు సంస్థలు నిధులు ఇచ్చినంతా మాత్రాన వారికే దాన్ని కట్టబెట్టాలని చూడటం ఎంత మాత్రం సరికాదన్నారు. విద్యార్థుల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ఆందోళనలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. న్యాయబద్ధంగా జరిగే ఏ పోరాటానికైనా మద్దతిస్తానని కవిత పేర్కొన్నారు.