కలాం సేవలు చిరస్మరణీయం : వంగవీటి రామారావు

దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు కలాం చేసిన సేవలు చిరస్మరణీయమని వంగవీటి రామారావు, ఎర్నేని కుసుమ అన్నారు. కోదాడలో ఆయన జయంతి కార్యక్రమం నిర్వహించారు.
APJ Abdul Kalam Jayanti celebrations in Kodad
APJ Abdul Kalam Jayanti celebrations in Kodad
Published on: 

ప్రభాత ఉదయం, కోదాడ : శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ఠ సేవలు అందించి దేశం కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ ఏపీజే కలాం అని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ అన్నారు. గురువారం కలాం జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీపార్క్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి తొలి మిస్సైల్ అందించిన ఘతన ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు నీలా సత్యనారాయణ, చీఫ్ అడ్వైజర్ పైడిమరి సత్తిబాబు, ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఉమ, శ్రీధర్, రాజశేఖర్, బాబు, సుధాకర్, వెంకటరమణ, సాయి, ప్రసాద్, చీటర్ల హనుమంత రావు, శంకర్, రవి, స్వామి పుల్లయ్య, నరేందర్, రామ్మూర్తి, సుధాకర్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.