‘కాయకల్ప’లో భద్రాద్రి దూకుడు

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని కొత్తగూడెం జిల్లా ఆస్పత్రులు కాయకల్ప అవార్డుల్లో సత్తాచాటాయి. పాల్వంచ ఆస్పత్రికి రూ.5 లక్షల నగదు బహుమతి లభించనుంది.
Kothagudem Hospitals Kayakalp Awards 2026
Kothagudem Hospitals Win Kayakalp Award 2026
Published on: 

ప్రభాత ఉదయం, కొత్తగూడెం: కాయకల్ప అవార్డుల్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కొత్తగూడెం జిల్లా ఆస్పత్రులు సత్తాచాటాయి. ప్రభుత్వాస్పత్రుల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఇన్ఫెక్షన్ కంట్రోల్, పర్యావరణ పరిరక్షణ, రోగులకు అందించే సేవలు, ఆసుపత్రి నిర్వహణ, నాణ్యతా ప్రమాణాల వంటి అంశాలను ఈ కాయకల్ప అవార్డుల ఎంపికలో పరిశీలిస్తారు. 2026 మార్చిలో జిల్లాలోని ఐదు ఆస్పత్రులను పరిశీలించి ఆరు అవార్డులు ప్రకటించారు.  ఒక్కో అవార్డుకు రూ.లక్ష చొప్పున, పాల్వంచ ఆస్పత్రికి ఎకో ఫ్రెండ్లీ రాష్ర్ట అవార్డు కింద రూ.5 లక్షల నగదు బహుమతి లభించనుంది.  డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు మాట్లాడుతూ.. ‘‘కలెక్టర్ అంకిత్, పూర్వ కలెక్టర్ జితేశ్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ  పీఓ బి.రాహుల్ల ప్రత్యేక పర్యవేక్షణ, సిబ్బంది సమష్టి కృషితోనే విజయం సాధించామన్నారు. సిబ్బందికి కాయకల్ప ప్రమాణాలపై ట్రైనింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సిబ్బంది కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేశారు.’’  అని ప్రశంసించారు.

ఇదే తొలిసారి

జిల్లాలో కాయకల్ప నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు హాజరైన అన్ని ఆస్పత్రులు అవార్డులు సాధించడం ఇదే తొలిసారి. పాల్వంచ సీహెచ్‌సీకి రాష్ర్ట స్థాయి ఎకో ఫ్రెండ్లీ అవార్డుతో పాటు భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు ఆస్పత్రులకు కమండేషన్ అవార్డులు దక్కాయి. మణుగూరు, అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రులు తొలిసారిగా కాయకల్ప నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు హాజరై అవార్డులు సాధించడం విశేషం.