రూ. 3 లక్షల బిల్లుకు రూ. లక్ష లంచం.. ఏసీబీకి చిక్కిన స్పోర్ట్స్ అధికారి

మహబూబ్‌నగర్‌లో కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష లంచం తీసుకున్నారనే ఆరోపణలతో యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డారు.
Mahabubnagar Youth and Sports Officer bribery case
మహబూబ్‌నగర్‌లో లంచం కేసులో యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి, కంప్యూటర్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ
Published on: 

ప్రభాత ఉదయం, మహబూబ్‌నగర్ : కాంట్రాక్టర్ నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని యూత్ అండ్ స్పోర్ట్స్ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ రూ. 3 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేశారు. వీటికి సంబంధించి బిల్లులు చేసేందుకు యూత్ అండ్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాజశేఖర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఉమేశ్ కలిసి రూ. లక్ష డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారి సూచనతో సదరు కాంట్రాక్టర్ గురువారం పాలమూరులోని ఓ హోటల్‌లో రాజేందర్ రెడ్డిని కలిసి డబ్బులు ఇచ్చారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు రాజేందర్ రెడ్డితో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.