అదనపు కట్నం కోసం వేధింపులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత అత్తింటి ఎదుట టెంట్ వేసి నిరసన తెలిపింది.
Dowry Harassment
Published on: 

ప్రభాత ఉదయం, చౌటుప్పల్: వేధింపులు తాళలేక ఓ వివాహిత అత్తింటి ఇంటి ఎదుటే టెంట్ వేసి బైఠాయించింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. సంస్థాన్ నారాయణపూర్ మండలం జనగాం గ్రామానికి చెందిన నర్రి రాజు కూతురు మౌనికకు మూడేళ్ల క్రితం దండుగుల నారాయణ-పద్మ కుమారుడు జనార్దన్‌తో వివాహమైంది. వీరికి తొమ్మిది నెలల కూతురు ఉంది.  వ్యసనాలకు బానిసైన భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం  వేధింపులకు పాల్పడుతున్నారు.  దీంతో విసిగిపోయిన బాధితురాలు ఉదయం ఇంటి ఎదుటే టెంట్ వేసి ధర్నా చేపట్టింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సీతాపాండు ఘటనా స్థలికి చేరుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.