తుఫ్రాన్‌లో ఏటీఎం చోరీకి యత్నం.. నిందితుడి అరెస్ట్‌

మెదక్‌ జిల్లా తుఫ్రాన్‌లో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Toopran SBI ATM theft attempt
Toopran SBI ATM theft attempt
Published on: 

ప్రభాత ఉదయం, మెదక్ : ఏటీఎంలో చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా తుఫ్రాన్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుఫ్రాన్‌ మండలం జండాపల్లి గ్రామానికి చెందిన భానుప్రకాశ్‌ పట్టణంలోని సూర్య మెడికల్‌ హాల్‌ పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించాడు. విధుల్లో ఉన్న ఎస్‌ఐ యాదగిరి దీన్ని గమనించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.