

ఉదయం ప్రతినిధి, జగిత్యాల: ఎల్ నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. బుధవారం జగిత్యాలలో నిర్వహించిన కిసాన్ మేళా – 2026లో ఆయన మాట్లాడుతూ.. నీటి లభ్యత, నేల స్వభావం, పెట్టుబడి వ్యయం, మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని రైతులకు సలహా ఇచ్చారు. శాస్త్రవేత్తల సలహాలతో సాగు చేపట్టాలన్నారు. రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలని, పంటలు ఎండిపోకుండా సకాలంలో విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ బీ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. రైతులు ఆధునిక పద్ధతులతో సాగు చేసి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.