ఓటు హక్కు పవిత్రతను కాపాడటమే లక్ష్యం : మంత్రి సీతక్క

ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించనున్న ఓట్ చోరీ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనేందుకు ములుగు నుంచి భారీగా తరలివెళ్తామని మంత్రి సీతక్క తెలిపారు.
Danasari Seethakka speaking about Anti vote theft protest in delhi
ఓట్ చోరీ వ్యతిరేక నిరసనలపై మాట్లాడుతున్న మంత్రి ధనసరి సీతక్క
Published on: 

ప్రభాత ఉదయం, ములుగు : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో జరగనున్న ఓట్ చోరీ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనేందుకు ములుగు నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. ములుగు క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటుహక్కు పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తోందని చెప్పారు. ఓటు.. ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కని, దానికి భంగం కలిగించే ఏ చర్యనైనా ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని సూచించారు. ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలన్నారు. ఓటు చోరీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి పాల్గొన్నారు.