సాయన్న జీవితం స్ఫూర్తిదాయకం

పండుగ సాయన్న విగ్రహాన్ని ముస్లాయిపల్లిలో మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
Panduga Sayanna
Minister Vatiki Srihari Unveils Panduga Sayanna Statue
Published on: 

ప్రభాత ఉదయం, మక్తల్: పండుగ సాయన్నను ముదిరాజ్ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయొద్దని, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ఆయన జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట్రమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ మండలం ముస్లాయిపల్లిలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ పాలమూరు ప్రాంతానికి చెందిన పండుగ సాయన్న 19వ శతాబ్దంలో నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి చరిత్రలో నిలిచిపోయారన్నారు. సాయన్న వీరగాథలు నేటికీ జానపద కళారూపాలు, కథల రూపంలో సజీవంగా నిలిచి ఉన్నాయన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు.