నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర

నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన మహాపాదయాత్రలో మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పదవి కోసం మూటలు మోస్తున్నారంటూ ఆరోపించారు.
BJP leaders participating in a Mahapadayatra in Nirmal
నిర్మల్‌లో బీజేపీ మహాపాదయాత్రలో పాల్గొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బండి సంజయ్ తదితర నేతలు
Published on: 

ప్రభాత ఉదయం నిర్మల్ ​: ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తన సీఎం పదవిని రెన్యూవల్​ చేసుకునేందుకు ఢిల్లీకి మూటలు మోస్తున్నాడంటూ బీజేపీఎల్పీ నేత, నిర్మల్​ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు. సర్​పై ఇండియా కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్​లో మహాపాదయాత్ర చేపట్టారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్​రెడ్డి నేడు రాహుల్​గాంధీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, సునీల్ బన్సల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు, బీజేపీ రాష్ర్ట సహ ఇన్​చార్జి అభయ్​ పాటిల్​ తదితరులు పాల్గొనారు.