

వీధుల్లో బైక్‌పై పర్యటించి అధికారులను నిలదీసిన
స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
ప్రభాత ఉదయం, పరకాల: పరకాల పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని అన్ని వార్డుల్లో మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలసి ఆయన బైక్‌పై పర్యటించారు. ఆయా వార్డుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారంపై అధికారులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బందిని నిలదీశారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి వసతులతోపాటు ప్రజలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. పరకాల పట్టణానికి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ దివ్య విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.