కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

మొయినాబాద్‌లో 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు.
Kalyana Lakshmi scheme Cheque distribution by Kale Yadaiah
మొయినాబాద్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
Published on: 

ప్రభాత ఉదయం, చేవెళ్ల : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మొయినాబాద్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు ఈ పథకాల కింద మంజూరైన రూ.15,00,250 విలువైన చెక్కులను గురువారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపిల్లల వివాహ ఖర్చులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.