గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమే వెన్నెముక

ఆలేరు మండలంలోని మూడు గ్రామాల్లో మదర్ డెయిరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు బోనస్ చెక్కులను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పంపిణీ చేశారు.
Beerla Ilaiah
Beerla Ilaiah distributes bonus cheques to dairy farmers
Published on: 

యాదగిరిగుట్ట, ప్రభాత ఉదయం: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి పరిశ్రమ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మదర్ డెయిరీ ఆధ్వర్యంలో ఆలేరు మండలం గోలనుకొండ, శారాజీపేట, మందనపల్లి గ్రామాల్లో బుధవారం ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తిదారుల బోనస్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాడి రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాత్రమే పాడి రైతులకు క్రమం తప్పకుండా బోనస్ అందిస్తోందని తెలిపారు. బోనస్ చెల్లించకుండా గత బీఆర్​ఎస్ ప్రభుత్వం​ రైతులను నిలువునా ముంచిందని విమర్శించారు. వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తి ద్వారా రైతులకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుందన్నారు. నాణ్యమైన పాల ఉత్పత్తితో సహకార రంగాన్ని బలోపేతం చేయాలని, ఆధునిక పశుపోషణ పద్ధతులను అవలంభించి ఉత్పత్తిని రెట్టింపు చేసుకోవాలని రైతులకు సూచించారు. పాడి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, పాల ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.