

ప్రభాత ఉదయం, యాదాద్రి భువనగిరి : తెలంగాణలో మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం కలిసి రెండు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–జగదేవ్‌పూర్–భువనగిరి–చౌటుప్పల్ మార్గానికి, అలాగే చౌటుప్పల్–ఆమనగల్లు–షాద్‌నగర్–సంగారెడ్డి మార్గాలకు జాతీయ రహదారి హోదా కల్పించాలని కోరారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌ను రీజినల్ రింగ్ రోడ్‌తో అనుసంధానించేలా, మెట్రో కారిడార్ వెంబడి 10 గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి స్పందిస్తూ, జాతీయ రహదారుల ప్రకటనకు సంబంధించిన విధివిధానాలు ఖరారైన వెంటనే, తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల సాధన కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తామని ఎంపీ చామల పేర్కొన్నారు.