

ప్రభాత ఉదయం, నకిరేకల్ : మూసీ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఐదారు రోజుల క్రితం హైదరాబాద్ నగరంతోపాటు ఎగువ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకల ద్వారా భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం క్రమంగా తగ్గింది. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 638.70 అడుగులకు చేరింది.