

ప్రభాత ఉదయం, నకిరేకల్ : ఎమ్మెల్యే వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని అన్నారం వద్ద చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న తన వాహనాన్ని మరొక కారు ఢీకొట్టింది. ఎయిర్‌బ్యాగ్‌లు తెరచుకోవడంతో పాటు భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఎమ్మెల్యే క్షేమంగా బయటపడ్డారు. వీరేశంను వెంటనే మరో కారులో పంపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.