అమెరికాలో నల్లగొండ యువతి అదృశ్యం

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి బోస్టన్‌లో పార్ట్‌టైం జాబ్ చేస్తున్న నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన కోయ శ్రీజారెడ్డి (23) అదృశ్యమైంది.
Koya Sreeja Reddy
కోయ శ్రీజారెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, సూర్యాపేట : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్లగొండ జిల్లా యువతి అదృశ్యమైంది. కనగల్ మండలం శాబ్దుల్లాపురానికి చెందిన యాదగిరిరెడ్డి, రూప దంపతుల కుమార్తె కోయ శ్రీజారెడ్డి (23) ఏడాది క్రితం బోస్టన్ వెళ్లింది. అక్కడి యూనివర్సిటీలో చదువుకుంటూ పార్ట్‌టైం జాబ్ చేస్తోంది. ఈ నెల 2న వాకింగ్‌కు వెళ్లిన శ్రీజా తిరిగి రాకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ లొకేషన్ బీచ్ ప్రాంతంలో కనిపిస్తుండటంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీజా అదృశ్యమైన విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి బోస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్, కేంద్ర విదేశాంగ శాఖతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మెయిల్ ద్వారా సమాచారం అందించారు. వీలైనంత త్వరగా యువతి ఆచూకీ కనుగొనేలా చర్యలు తీసుకోవాలని బోస్టన్ కాన్సులేట్ జనరల్‌ను కోరారు.