

ప్రభాత ఉదయం, నకిరేకల్: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం గోపాలపల్లి సమీపంలోని ఐడీఎల్ కంపెనీలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడగా.. పేలుడు ధాటికి కంపెనీ భవనం కూలిపోయింది. ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన పబ్బు శివప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాకు చెందిన ప్రతాప్ దేహురి, ఈశ్వర్ ప్రధాన్, ఉత్తమ్ కుందర్ కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి భవనం కూలినప్పటికీ ప్రాణనష్టం జరగలేదని నార్కెట్‌పల్లి ఎస్‌ఐ సీహెచ్. వెంకటేశ్వర్లు తెలిపారు.