చింతకుంటలో సీసీ నిఘా

Nirmal SP Janaki Sharmila
Published on: 
  • సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

  • నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల

ప్రభాత ఉదయం, భైంసా : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్​ మండలం చింతకుంట గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాండ్ మేళాలతో ఆమెకు స్థానికులు స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల మాట్లాడారు. చిన్న గ్రామమైనప్పటికీ చింతకుంటలో గ్రామస్థులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ పనితీరును ఆమె అభినందించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సీఐ రవీందర్, ఎస్సై పెర్సీస్ తదితరులు పాల్గొన్నారు.