కరీంనగర్ ‘మహా పాదయాత్ర’కు నేనే వస్తా : బండి సంజయ్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్

కరీంనగర్‌లో చేపట్టే 'మహా పాదయాత్ర'కు తాను స్వయంగా వస్తానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్​తో అన్నారు.
BJP National President Nitin Nabin
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ సర్ విషయంలో వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కరీంనగర్‌లో చేపడుతున్న ‘మహా పాదయాత్ర’కు తానే స్వయంగా వస్తానని ఈ సందర్భంగా బండి సంజయ్‌కు నితిన్ నబీ చెప్పారు. వాస్తవానికి ఈనెల 5న కరీంనగర్​ రావాల్సి ఉన్నప్పటికీ, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున వీలుకాలేదన్నారు. చట్ పూజ అనంతరం తప్పకుండా వచ్చి మహా పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. కరీంనగర్​లో కాషాయ శ్రేణుల జోష్​ను చూస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై బండి సంజయ్‌తో చర్చించారు.