‘యాద్రాద్రి థర్మల్ ప్లాంట్’లో సమస్యలకు చెక్!

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో తనిఖీల్లో గుర్తించిన 600 సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు టీజీ జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ అధికారులు చర్యలు చేపట్టారు.
Yadadri Thermal Power Plant
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు జెన్ కో, బీహెచ్ఈల్ అధికారులు రంగంలోకి దిగారు. గత నెలలో ఈ సంస్థల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో 600 సమస్యలను గుర్తించారు. వీటిలో ప్రధానమైన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలోనే బీహెచ్ఈఎల్ బృందం, సబ్ వెండర్ల ప్రతినిధులు, టీజీ జెన్ కో సీఎండీ హరీశ్ యాదాద్రి ప్లాంట్‌లో పరిస్థితిని బుధవారం సమీక్షించారు. బీహెచ్ఈఎల్ డైరెక్టర్(పవర్) తజీందర్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు, సబ్ వెండర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు సంబంధించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లోని వ్యాగన్ టిప్లర్లు, క్రషర్ హౌస్‌ను పరిశీలించారు. సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.