సినిమా రేంజ్‌లో చైనా పటాకుల అక్రమ రవాణా

Chinese Firecrackers
Illegal Chinese Firecrackers Seized At Chennai Port
Published on: 
  • చెన్నై పోర్టు గుండా దేశంలోకి అక్రమ రవాణా

  • రూ.12 కోట్ల విలువైన పటాకులు స్వాధీనం

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న చైనా పటాకులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై పోర్టులో అనుమానాస్పద కంటైనర్లపై డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.  ఈ తరుణంలోనే ఇతర సరుకుల మధ్య దాచిన రూ.12 కోట్ల విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నారు.

అనుమతులు లేకుండానే దిగుమతి

విదేశీ వాణిజ్య నిబంధనల ప్రకారం పటాకుల దిగుమతికి డీజీఎఫ్‌టీ, పెసో నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ తప్పుడు వివరాలతో పటాకులను ఇండియాకు తీసుకొచ్చారని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. దీంతో కస్టమ్స్ చట్టం-1962 నిబంధనల ప్రకారం నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటివి పునరావృతమైతే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.