

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్(ఐపీఈ) నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గత డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి పదవీ కాలం ముగియడంతో ఐపీఈ డైరెక్టర్ సంస్థకు చెందిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లింబాద్రిని నియమించింది. బోర్డు ప్రెసిడెంట్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాధవరావు వ్యవహరిస్తున్నారు. ఐపీఈ పదవీ కాలం సాధారణంగా ఐదేళ్లు ఉంటుంది. లింబాద్రి గతంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారి వంటి పలు పదవులు నిర్వహించారు.