తెలంగాణ బిడ్డ కలం.. జాతి గొంతుగా మారిన ‘పైడిమర్రి ప్రతిజ్ఞ’

తెలంగాణ బిడ్డ కలం.. జాతి గొంతుగా మారిన ‘పైడిమర్రి ప్రతిజ్ఞ’
Published on: 

25 ఏళ్ల తర్వాత తెలిసింది

తాను రాసిన ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు రోజూ పఠిస్తున్నారనే విషయం పైడిమర్రి వెంకట సుబ్బారావుకే తెలియకపోవడం ఈ కథలోని ఆసక్తికరమైన మలుపు. ప్రతిజ్ఞ రాసిన దాదాపు 25 ఏళ్ల తర్వాత, 1987లో ఆయనకీ విషయం తెలిసింది. అప్పటికే జిల్లా కోశాధికారి పదవి నుంచి పదవీ విరమణ చేసిన సుబ్బారావు.. మూడో తరగతి చదువుతున్న తన మనుమరాలుకు చదువుల్లో సాయం చేసేవారు. ఒకరోజు ఆమె పాఠ్యపుస్తకంలోని ప్రతిజ్ఞను చదువుతుండగా సుబ్బారావు విన్నారు. ఆ విధంగా తాను రాసిన ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా విద్యార్థుల నిత్య పఠనంలో భాగమైందన్న విషయం ఆయనకు తొలిసారి తెలిసింది.

గుర్తింపు కోసం సుదీర్ఘ పోరాటం..

దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రతిరోజూ పఠించే ప్రతిజ్ఞకు అప్పట్లో పుస్తకాలపై రచయితగా పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు కనిపించేది కాదు. ఆయన రచనకు తగిన గుర్తింపు దక్కాలనే ప్రయత్నాలు మాత్రం కొనసాగాయి. ఈ క్రమంలో ఎలికట్టి శంకర్రావు 2011లో ‘ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి’ పేరుతో ప్రత్యేక సంచికను ప్రచురించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుబ్బారావుకు అధికారికంగా గుర్తింపు దక్కే దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల సిలబస్‌ మార్పులపై ఏర్పాటు చేసిన కమిటీలో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆయన చొరవతో తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో జాతీయ ప్రతిజ్ఞ రచయితగా పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రించారు.

ఇదే సమయంలో ప్రతిజ్ఞ రచయిత ఎవరనే విషయంపై స్పష్టత కోసం రామ్‌ ప్రదీప్ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా కేంద్ర హోంశాఖను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన NCERT.. జాతీయ ప్రతిజ్ఞను రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావేనని స్పష్టం చేసింది.జాతీయ గీతం ‘జనగణమన’ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్.. జాతీయ జెండా రూపకర్త అనగానే పింగళి వెంకయ్య.. ఈ పేర్లు మనందరికీ సుపరిచితమే. మరి.. పాఠశాలల్లో ప్రతి ఉదయం లక్షలాది మంది విద్యార్థులు గళమెత్తి చదివే “భారతదేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు” అంటూ సాగే జాతీయ ప్రతిజ్ఞను రచించింది ఎవరో చాలా మందికి తెలియదు. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నికార్సైన నిజం.

దేశభక్తి, జాతీయ సమైక్యత, సోదరభావం, క్రమశిక్షణ వంటి విలువలను మనసుల్లో నాటే ఈ ప్రతిజ్ఞతో మనకు చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. కానీ దాని వెనుక ఉన్న రచయిత పేరు మాత్రం చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ జాతీయ ప్రతిజ్ఞను రచించించింది ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? ఆ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా పాఠశాలల్లోకి ఎలా చేరింది? వివరాలను తెలుసుకుందాం..

నల్లగొండ బిడ్డ కలం నుంచి.. దేశం గొంతుకగా మారిన ప్రతిజ్ఞ

ఈ ప్రతిజ్ఞ పుట్టింది తెలుగు గడ్డపై. చాలా మందికి తెలియని నిజం ఇంది. నల్లగొండ జిల్లా అన్నెపర్తికి చెందిన రచయిత, ప్రకృతి వైద్యుడు, ప్రభుత్వ అధికారి పైడిమర్రి వెంకట సుబ్బారావు 1962లో తెలుగులో ఈ ప్రతిజ్ఞను రచించారు. 1962.. చైనాతో యుద్ధం దేశాన్ని కలవరపెడుతున్న సమయం. మరోవైపు దేశ విభజన గాయాల నుంచి భారత్‌ ఇంకా పూర్తిగా కోలుకోని పరిస్థితి. స్వాతంత్ర్య పోరాటం వెనుక ఉన్న దేశభక్తి, ఐక్యత స్ఫూర్తి క్రమంగా మరుగునపడుతున్న తీరు పైడిమర్రి వెంకట సుబ్బారావును తీవ్రంగా కలచివేసింది. దేశం పట్ల ప్రేమ, పౌరుల్లో జాతీయ భావన, ఐక్యతను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని ఆయన గట్టిగా భావించారు. పౌరుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు తన వంతుగా ఏదైనా చేయాలని ఆయన సంకల్పించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంచేందుకు చైనాలో దేశభక్తి గీతాలు, కార్యక్రమాలు ఉన్నాయని తెలుసుకున్న ఆయన.. అదే స్ఫూర్తితో భారతీయ విద్యార్థుల్లో జాతీయ భావనను పెంపొందించేలా తొమ్మిది వాక్యాలతో కూడిన ‘ప్రతిజ్ఞ’ను రచించారు.

విశాఖ నుంచి దేశవ్యాప్తంగా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో జిల్లా ఖజానా అధికారిగా పని చేస్తున్న సమయంలో పైడిమర్రి వెంకట సుబ్బారావు 1962 సెప్టెంబర్ 17న తొమ్మిది వాక్యాలతో కూడిన ‘ప్రతిజ్ఞ’ను రచించారు. ఈ ప్రతిజ్ఞను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాథంకు చూపించారు. ఈ ప్రతిజ్ఞ తెన్నెటీని ఎంతో ఆకట్టుకుంది. వెంటనే ఆయన ఈ ప్రతిజ్ఞను అప్పటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పూసపాటి విజయరామ గజపతి రాజు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల్లో ప్రాంతం, మతం, భాష వంటి భిన్న నేపథ్యాలను దాటి ఐక్యత, జాతీయ భావన పెంపొందించడమే లక్ష్యంగా అన్ని పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో విద్యార్థులతో తొలిసారిగా ఈ ప్రతిజ్ఞను చదివించారు.

1964లో బెంగళూరులో జరిగిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ఈ ప్రతిజ్ఞ విషయాన్ని అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మహమ్మద్ అలీ కరీం చాగ్లా దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనతో ప్రతిజ్ఞను 18 భారతీయ భాషల్లోకి అనువదించి, దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు పఠించేలా అన్ని రాష్ట్రాలకు సూచనలు వెళ్లాయి.  ‘భారతదేశం నా మాతృభూమి..’ అంటూ సాగే ప్రతిజ్ఞ 1965, జనవరి 26 నుంచి దేశ వ్యాప్తంగా దేశంలోని ప్రతి పాఠశాలలో ప్రతిజ్ఞ చేయడం ప్రారంభించారు.

25 ఏళ్ల తర్వాత తెలిసింది

తాను రాసిన ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు రోజూ పఠిస్తున్నారనే విషయం పైడిమర్రి వెంకట సుబ్బారావుకే తెలియకపోవడం ఈ కథలోని ఆసక్తికరమైన మలుపు. ప్రతిజ్ఞ రాసిన దాదాపు 25 ఏళ్ల తర్వాత, 1987లో ఆయనకీ విషయం తెలిసింది. అప్పటికే జిల్లా కోశాధికారి పదవి నుంచి పదవీ విరమణ చేసిన సుబ్బారావు.. మూడో తరగతి చదువుతున్న తన మనుమరాలుకు చదువుల్లో సాయం చేసేవారు. ఒకరోజు ఆమె పాఠ్యపుస్తకంలోని ప్రతిజ్ఞను చదువుతుండగా సుబ్బారావు విన్నారు. ఆ విధంగా తాను రాసిన ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా విద్యార్థుల నిత్య పఠనంలో భాగమైందన్న విషయం ఆయనకు తొలిసారి తెలిసింది.

గుర్తింపు కోసం సుదీర్ఘ పోరాటం..

దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రతిరోజూ పఠించే ప్రతిజ్ఞకు అప్పట్లో పుస్తకాలపై రచయితగా పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు కనిపించేది కాదు. ఆయన రచనకు తగిన గుర్తింపు దక్కాలనే ప్రయత్నాలు మాత్రం కొనసాగాయి. ఈ క్రమంలో ఎలికట్టి శంకర్రావు 2011లో ‘ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి’ పేరుతో ప్రత్యేక సంచికను ప్రచురించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుబ్బారావుకు అధికారికంగా గుర్తింపు దక్కే దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల సిలబస్‌ మార్పులపై ఏర్పాటు చేసిన కమిటీలో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆయన చొరవతో తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో జాతీయ ప్రతిజ్ఞ రచయితగా పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రించారు.

ఇదే సమయంలో ప్రతిజ్ఞ రచయిత ఎవరనే విషయంపై స్పష్టత కోసం రామ్‌ ప్రదీప్ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా కేంద్ర హోంశాఖను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన NCERT.. జాతీయ ప్రతిజ్ఞను రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావేనని స్పష్టం చేసింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి.. పైడిమర్రి జీవన ప్రస్థానం

నల్లగొండ సమీపంలోని అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న  పైడిమర్రి రాంబాయమ్మ, వెంకవూటామయ్య దంపతులకు పైడిమర్రి వెంకట సుబ్బారావు జన్మించారు. అన్నెపర్తి, నల్లగొండలోనే ఆయన విద్యాభ్యాసం సాగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.

సాహిత్యంపై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచుకున్న ఆయన.. 18 ఏళ్ల వయసులోనే ‘కాలభైరవుడు’ అనే కలం పేరుతో నవల రాశారు. ‘ఉషస్సు కథలు’ కథా సంపుటితో పాటు దేవదత్తుడు, తులసీదాస్, త్యాగరాజు వంటి పద్యకావ్యాలు, బ్రహ్మచర్యం, గృహస్థ జీవితం, స్త్రీధర్మం, ఫిరదౌసి, శ్రీమతి వంటి నాటకాలు రచించారు. అనేక అనువాద రచనలు కూడా చేశారు. వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యవస్థ వంటి సామాజిక సమస్యలపై తన రచనల ద్వారా స్పందించారు. 1945–46లో నల్లగొండలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభల్లోనూ కీలక పాత్ర పోషించారు.

సాహిత్యంతో పాటు ప్రభుత్వ సేవలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో ట్రెజరీ విభాగంలో ఉద్యోగంలో చేరి.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, నల్లగొండ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1971లో పదవీ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత నల్లగొండలో హోమియో వైద్యుడిగా సేవలందించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి ఉచితంగా వైద్యం అందిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. 1988 ఆగస్టు 13న ఆయన కన్నుమూశారు.

పైడిమర్రి తన జీవితకాలంలో రాసిన ఎన్నో రచనల కంటే.. దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల గొంతుల్లో నేటికీ మారుమోగుతున్న “భారతదేశం నా మాతృభూమి..” అనే ప్రతిజ్ఞ ఆయనకు చెరగని గుర్తింపుగా మిగిలిపోయింది.