ఓవర్ కాన్ఫిడెన్స్ వీడితేనే విజయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఓవర్ కాన్ఫిడెన్స్ వీడి, పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డి స్పష్టం చేశారు.
BRS Candidate Rakesh Reddy
Anugula Rakesh Reddy
Published on: 

ప్రభాత ఉదయం, యాదగిరిగుట్ట: రాబోయే ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఓవర్ కాన్ఫిడెన్స్ వీడి, క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. గత ఎన్నికల్లో ఓటర్ల నమోదు సరిగ్గా చేయకపోవడం వల్లే స్వల్ప తేడాతో ఓటమి ఎదురైందని గుర్తు చేశారు. ఈసారి ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు జాగ్రత్తగా పూర్తి చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రానున్న దసరా సెలవుల్లో రిలాక్స్ కాకుండా ఓటు నమోదు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం లాంటివని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. డిక్లరేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అందరనీ మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయాలని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్‌కు ‌అగ్నిపరీక్ష లాంటివని, ఇక్కడ సాధించే విజయమే భవిష్యత్తులో పార్టీని ఆపడం ఎవరి తరం కాదని అన్నారు.