రామగుండం ఎన్‌టీపీసీకి సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు

ఢిల్లీలో ఐఈఐ-ఎస్‌క్యూఎఫ్ నిర్వహించిన 23వ అంతర్జాతీయ భద్రతా సదస్సు సందర్భంగా సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డును రామగుండం ఎన్టీపీసీ అధికారులకు అందజేశారు.
Ramagundam NTPC receives safety innovation award
Ramagundam NTPC Telangana Super Thermal Power Project wins Safety Innovation Award
Published on: 

ప్రభాత ఉదయం, రామగుండం : రామగుండంలోని ఎన్‌టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు – 2026 లభించింది. శుక్రవారం ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్‌లో ఐఈఐ–ఎస్‌క్యూఎఫ్ నిర్వహించిన 23వ అంతర్జాతీయ భద్రతా సదస్సులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఎన్‌టీపీసీ తెలంగాణ తరఫున ఏజీఎం (ఈఎండీ) రజనీశ్ చంద్ర సన్యాల్, సీనియర్ మేనేజర్ (సేఫ్టీ) ఏవీఎన్ రెడ్డి అవార్డును అందుకున్నారు. భద్రతా ప్రమాణాల అమలు, వినూత్న భద్రతా పద్ధతుల అనుసరణతో పాటు కార్యకలాపాలన్నింటిలో పటిష్ఠమైన భద్రతా సంస్కృతిని నిరంతరం ప్రోత్సహిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించిందని ఎన్‌టీపీసీ అధికారులు తెలిపారు.