

ప్రభాత ఉదయం, చొప్పదండి : జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎన్డీఏ/ఎన్ఏ ప్రవేశ పరీక్షలో రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కు క్యాడెట్లు కురవ నరేష్, కోటల అభిషేక్ ఉత్తీర్ణత సాధించారని డైరెక్టర్ కల్నాల్ రాజా దత్త, ప్రిన్సిపాల్ దేవేందర్ తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూకు అర్హత సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీని అభినందించారు. ఎస్ఎస్‌బీలోనూ ఎంపికై దేశ సేవలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు.