గనుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు
Bhupalpally Mines
Singareni Director Koppula Venkateswarlu inspected the Bhupalpally Mines
Published on: 

ప్రభాత ఉదయం, జయశంకర్ భూపాలపల్లి: భవిష్యత్ బొగ్గు అవసరాల దృష్ట్యా గనుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి భూపాలపల్లి ఏరియాలోని ఓసీ-2, 3 గనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గనుల్లో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ తొలగింపు, గని అభివృద్ధి పనులు, యంత్రాల పనితీరు, ఉత్పత్తి లక్ష్యాల సాధన తదితర అంశాలను డైరెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏరియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మానవ వనరులు, యంత్రాలు, ఇతర వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ-2 జీఎం రామన్ వీ పాఠక్, ఓసీ-2 ప్రాజెక్టు ఆఫీసర్ డీ శ్యాంసుందర్, ఓసీ-3 ప్రాజెక్టు ఆఫీసర్ రామస్వామి, ఏజీఎం(సివిల్) రవికుమార్, ఏజీఎం(ఈఅండ్ఎం) సాంబశివరావు,   డీ‌జీ‌ఎం(ఫైనాన్స్) రాజేశ్వర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఏరియా సర్వే ఆఫీసర్ శైలేంద్ర కుమార్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.