సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0లో తెలంగాణకు చోటివ్వండి : శ్రీధర్‌బాబు

ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0లో తెలంగాణను భాగస్వామ్యం చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని కోరారు.
Sridhar Babu has requested the Central Govt to include Telangana as a partner in Semiconductor Mission 2.0
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
Published on: 

ప్రభాత ఉదయం, న్యూఢిల్లీ : సెమీకండక్టర్ మిషన్ 2లో తెలంగాణను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫలితంగా ఫ్యాబ్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్ విభాగాల్లో రాష్ట్రం అగ్రగామిగా ఎదిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గురువారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్‌లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర డిఫెన్స్ ఎగుమతులు గతంతో పోలిస్తే 103 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని 2030 నాటికి 5 గిగావాట్లకు చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ 2లో పాల్గొనాలని మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలను కోరారు. "తెలంగాణలో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతమి లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.