

చరిత్ర మరచిన గొండు వీరుడు..రాంజీగోండ్
మర్సికోల్ల రాంజీగోండ్ తెలంగాణ ఆదివాసీ ఉద్యమ చరిత్రలో అగ్రగణ్యుడైన విప్లవ వీరుడు. ఉమ్మడి ఆదిలాబాద్ (ముఖ్యంగా నిర్మల్, ఆసిఫాబాద్) అటవీ ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, హైదరాబాద్ నిజాం పాలనలోని దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగించిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. 1836 నుండి 1860 మధ్యకాలంలో గోండ్వానా ప్రాంతం కేంద్రంగా బ్రిటీష్, నిజాం పాలకులకు వ్యతిరేకంగా (ఉమ్మడి ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాలు) మర్సికోల్ల రాంజీగోండ్ చేసిన పోరాటాలకు చరిత్రలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదు.
పన్నుల దౌర్జన్యం' – ఆదివాసీల ఆర్థిక రక్షణ
రాంజీ గోండ్ తిరుగుబాటు కేవలం రాజకీయ అధికార మార్పిడి కోసం జరిగింది కాదు. నాటి నిజాం పాలనలోని జమీందార్లు, దొరలు, దేశ్‌ముఖ్‌లు ఆదివాసీలు మరియు స్థానిక రైతులపై మోపిన దౌర్జన్యపూరిత పన్నుల వసూళ్లను అడ్డుకోవడం ఈ పోరాటం వెనుక ఉన్న ప్రధాన సామాజిక-ఆర్థిక కారణం. గిరిజనుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, పంటలపై అధిక పన్నులు రాబట్టడం వంటి చర్యలను రాంజీ తన దళంతో తీవ్రంగా నిరోధించారు. బలవంతపు వసూళ్లను నిలిపివేయించి, పేద ప్రజలకు అండగా నిలవడం ద్వారా ఆయన స్థానికుల గుండెల్లో ఇలవేల్పుగా మారారు.
'జల్, జంగల్, జమీన్' పోరాటానికి మూల బీజం
నైజాం నవాబు అణచివేతపై తర్వాతి కాలంలో కొమురం భీమ్ లేవనెత్తిన చారిత్రక నినాదం 'జల్, జంగల్, జమీన్' (నీరు, అడవి, భూమి) కు అసలు మూల విత్తనం రాంజీ గోండ్ సాగించిన సాయుధ పోరాటమే. తమ అడవిపై, భూమిపై, ప్రకృతి వనరులపై గిరిజనులకే సర్వహక్కులు ఉండాలనే స్పృహను నిర్మల్ గడ్డపై రాంజీగోండే మొదట రగిలించారు. ఈ చారిత్రక తిరుగుబాటే శతాబ్దం తర్వాత వచ్చిన కొమురం భీమ్ వంటి వీరులకు గొప్ప మార్గదర్శకంగా, పోరాట స్ఫూర్తిగా నిలిచింది.
గోండు సంప్రదాయంలో సజీవ చరిత్ర
పాలకులు, ఆంగ్లేయ చరిత్రకారులు ఈ దారుణ మారణకాండను చరిత్ర పుటల్లో ఎక్కించకుండా దాచిపెట్టినప్పటికీ, గోండు తెగల జానపద సంప్రదాయం ఈ వీరగాథను సజీవంగా కాపాడుకుంది. గోండు సమాజంలోని 'తోటీ', 'ప్రధాన్' గాయక కళాకారులు తరతరాలుగా తమ దస్తాన్లు, జానపద గేయాల రూపంలో రాంజీ గోండ్ శౌర్యాన్ని, 'వెయ్యి ఉరుల మర్రి' కింద జరిగిన అమరవీరుల త్యాగాన్ని పాడుకుంటూ వచ్చారు. అధికారిక ఆధారాలు లేని చోట కూడా ఈ నోటిమాట చరిత్రే (Oral History) ఆనాటి నిజాం-బ్రిటిష్ క్రూరత్వాన్ని నేటి తరానికి అందించిన ప్రధాన సాధనమైంది.
వీరుల జ్ఞాపకం చెరిగిపోలేదు
రాంజీ గోండు పోరాటం ఎక్కువకాలం అధికారిక చరిత్రలో పెద్దగా ప్రస్తావనకు రాలేదు. పాఠ్యపుస్తకాల్లోనూ ఆయనకు తగిన స్థానం దక్కలేదనే ఆవేదన గిరిజన వర్గాల్లో ఉంది. అయినప్పటికీ ఆయన పోరాట స్ఫూర్తి ఆదివాసీ హక్కుల కోసం తరువాత జరిగిన ఉద్యమాల చరిత్రలో ప్రతిధ్వనించింది. ముఖ్యంగా కొమురం భీమ్ పోరాటాన్ని గుర్తుచేసుకునే సందర్భాల్లో రాంజీ గోండు వంటి గిరిజన యోధుల త్యాగాలు ప్రస్తావనకు వస్తాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో రాంజీ గోండు, ఆయనతో కలిసి పోరాడిన వీరుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు సంఘాలు కార్యక్రమాలు చేపట్టాయి. 2007 నవంబర్ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2008 నవంబర్ 14న నిర్మల్‌లోని చైన్‌గేట్ వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మర్రిచెట్టు కాలగర్భంలో కలిసిపోయింది.. కాలచక్రం ముందుకు సాగింది. కానీ ఆ మహావృక్షం కింద ప్రాణత్యాగం చేసిన గోండు వీరుల పోరాట స్ఫూర్తి మాత్రం నేటికీ నిర్మల్ నేలపై చెరిగిపోని జ్ఞాపకంగా నిలిచింది.కొయ్యబొమ్మల కళానగరిగా ప్రసిద్ధి చెందిన నిర్మల్ వెనుక మనకు తెలియని ఒక రక్తాక్షరాల స్వాతంత్ర్య పోరాట చరిత్ర దాగి ఉంది. బ్రిటిష్–నిజాం పాలనకు ఎదురు నిలిచి ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గోండు వీరుడు మర్సికోల్ల రాంజీగోండ్ అడుగుజాడలు ఈ నేలపై ఉన్నాయి. రాంజీగోండ్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని అణచివేసేందుకు జరిగిన దారుణ ఘటనలకు నిర్మల్ సాక్ష్యంగా నిలిచింది. రాంజీ గోండుతో పాటు పలువురు గోండు యోధులకు అక్కడే ఉరిశిక్ష అమలు చేసినట్లు స్థానిక చరిత్ర, తరతరాలుగా వస్తున్న జ్ఞాపకాలు చెబుతున్నాయి. అందుకే ఆ మర్రిచెట్టు ‘వెయ్యి ఉరుల మర్రి’గా పేరుపొంది, ఆ నాటి వీరుల విషాదాంతానికి గుర్తుగా నిలిచింది. నేడు ఆ మర్రిచెట్టు లేకపోయినా.. దాని జ్ఞాపకం మాత్రం నిర్మల్ నేలపై చెరగని ముద్రగా మిగిలింది.
నిర్మల్ గడ్డపై రగిలిన స్వాతంత్య్ర సమర జ్వాల
నిర్మల్ అంటే కొయ్యబొమ్మలు, ప్రకృతి అందాలు మాత్రమే కాదు.. ఈ నేలలో ఆదివాసీ వీరుల పోరాట చరిత్ర కూడా దాగి ఉంది. కూడా దాగి ఉంది. దేశంలో 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ప్రభావం నిర్మల్ ప్రాంతానికీ చేరింది. బ్రిటిష్ పాలనను ఎదుర్కొనేందుకు ఉత్తర భారతంలో పోరాడిన తాంతియాతోపే అనుచరులైన రొహిల్లాలు నిర్మల్ వైపు అడుగులు వేశారు. అదే సమయంలో జనగాం (ఆసిఫాబాద్) ప్రాంతంలో పోరాటం సాగిస్తున్న గోండు యోధుడు రాంజీ కూడా నిర్మల్ ప్రాంతానికి చేరుకున్నారు.
రాంజీ గోండుకు రొహిల్లాల అండ.. గిరిబిడ్డల సమర సన్నాహం
బ్రిటిష్, నిజాం బలగాలు అడవుల్లోకి చొచ్చుకువస్తున్న పరిస్థితుల్లో రాంజీ గోండు తనతో పాటు గోండు వీరులను సమీకరించారు. రొహిల్లాల దండు కూడా ఆయనకు అండగా నిలిచింది. దక్కనీ, మరాఠా వర్గాలకు చెందిన కొందరు కూడా ఈ పోరాటంలో భాగస్వాములయ్యారు. రొహిల్లాల సర్దార్ హజీతో కలిసి రాంజీ గోండు ఉమ్మడి శత్రువులను ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేశారు. ఆధునిక ఆయుధాలు, సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ.. నిర్మల్ ప్రాంతంలోని గుట్టలు, అడవులు, చెరువుల వంటి సహజ భౌగోళిక పరిస్థితులను రాంజీ గోండు తన పోరాట వ్యూహంలో భాగంగా మలుచుకున్నారు. గుట్టలు, గొలుసుకట్టు చెరువులు, దట్టమైన అడవులు, లోయలను ఆసరాగా చేసుకుని గెరిల్లా పద్ధతిలో పోరాటం సాగించారు. స్థానిక ప్రాంతాలపై ఉన్న అవగాహనతో బ్రిటిష్ సైనిక బలగాలకు ముప్పుతిప్పలు పెట్టారు. స్థానిక ఆంగ్లేయ కలెక్టర్ నేతృత్వంలోని సైనిక బలగాలను కూడా పలుమార్లు ఎదుర్కొన్నారు.
గెరిల్లా పోరుతో బ్రిటిష్‌కు సవాల్
రాంజీ గోండు, రొహిల్లాలు, ఇతర యోధులు కలిసి నిర్మల్ కేంద్రంగా పోరాటం సాగిస్తున్న విషయం కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్సన్కు చేరింది. ఈ విషయం నాటి పాలకుడు ఆఫ్జల్ ఉద్దౌలాకు కూడా తెలిసింది. అప్పటికే డేవిడ్సన్, ఆఫ్జల్ ఉద్దౌలాతో పాటు దివాన్ సాలర్జంగ్ దక్షిణ భారతదేశంలో ప్రథమ స్వాతంత్య్ర పోరును అణచివేసే చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. నిర్మల్ ప్రాంతంలో రాంజీ గోండు ఆధ్వర్యంలో తిరుగుబాటు కొనసాగడం తీవ్రంగా పరిగణించిన బ్రిటిష్ పాలకులు మరింత బలమైన సైనిక చర్యకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బళ్లారిలోని 47వ నేషనల్ ఇన్ఫాంట్రీని నిర్మల్‌కు తరలించారు. కల్నల్ రాబర్ట్ ఆధ్వర్యంలోని సైనిక బలగాలు నిర్మల్ ప్రాంతంలోకి ప్రవేశించాయి. అయితే నిర్మల్ భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం బ్రిటిష్ సైన్యానికి ఇబ్బందిగా మారింది. అడవులు, గుట్టలను ఆసరాగా చేసుకున్న రాంజీ గోండు సేన గెరిల్లా పద్ధతిలో దాడులు చేయడంతో రాబర్ట్ సైన్యం రెండుసార్లు నష్టపోయింది.
రాంజీ గోండ్ తన పోరాటంలో కేవలం అడవులకే పరిమితం కాకుండా గోదావరి నదీ తీర ప్రాంతమైన 'సోన్' (Soan) పరిసరాలను అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు. నిర్మల్ ప్రాంతానికి సమీపంలో ఉండే ఈ గోదావరి పరివాహక ప్రాంతం దట్టమైన పొదలు, కొండలతో నిండి ఉండేది. బ్రిటిష్, నిజాం సైన్యాలను తిప్పికొట్టేందుకు స్థానిక గిరిజనులకు, రైతులకు రాంజీ ఇక్కడే ఆత్మరక్షణ మెళకువలతో పాటు గెరిల్లా యుద్ధ శిక్షణ ఇచ్చేవారు. సైన్యానికి కావలసిన వనరులను సమకూర్చుకోవడానికి, రహస్య సమావేశాలు నిర్వహించడానికి సోన్ ప్రాంతం ప్రధాన కేంద్రంగా విలసిల్లింది. దీంతో రాంజీని నేరుగా ఎదుర్కోవడం కంటే వ్యూహాత్మకంగా పట్టుకోవాలని బ్రిటిష్ బలగాలు ప్రయత్నించాయి.
వెయ్యి మంది వీరులకు ఉరి
చివరికి బ్రిటిష్ సైన్యం పన్నిన వ్యూహం ఫలించింది. రాంజీ గోండుతో పాటు సుమారు వెయ్యిమంది యోధులు వారి చేతికి చిక్కారు. బందీలుగా పట్టుబడిన వారిని నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి మార్గంలో ఉన్న భారీ మర్రిచెట్టు వద్దకు తీసుకెళ్లినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. అక్కడ 1860 ఏప్రిల్ 9న రాంజీ గోండుతో పాటు వెయ్యిమందిని ఆ మర్రిచెట్టు ఊడలకు ఉరితీసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
వెలుగులోకి రాని విషాద గాథ
ఒకే చెట్టుకు ఇంతమంది వీరులను ఉరితీశారనే జ్ఞాపకంతో ఆ మహావృక్షం ‘వెయ్యి ఉరుల మర్రి’గా చరిత్రలో నిలిచిపోయింది. తమ నేల, తమ ప్రజలు, తమ హక్కుల కోసం పోరాడిన గిరిజన యోధుల త్యాగాలకు అది నిశ్శబ్ద సాక్ష్యంగా మారింది. అయితే ఇంతటి విషాదకర ఘటన, వీరుల బలిదాన గాథ చాలా కాలం చరిత్ర పుటల్లో పెద్దగా వెలుగులోకి రాకపోవడం, వారికి దక్కాల్సిన గుర్తింపు, ప్రాధాన్యం లభించకపోవడం విషాదకరం. కాలం గడిచేకొద్దీ ‘వెయ్యి ఉరుల మర్రి’గా గుర్తింపు పొందిన ఆ మహా వృక్షం కూడా కనుమరుగైంది. 1995లో బలమైన గాలివానకు చెట్టు నేలకొరిగింది. చెట్టు లేకపోయినా.. దానికి సంబంధించిన వీరగాథ మాత్రం నిర్మల్ ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోయింది.
చరిత్ర మరచిన గొండు వీరుడు..రాంజీగోండ్
మర్సికోల్ల రాంజీగోండ్ తెలంగాణ ఆదివాసీ ఉద్యమ చరిత్రలో అగ్రగణ్యుడైన విప్లవ వీరుడు. ఉమ్మడి ఆదిలాబాద్ (ముఖ్యంగా నిర్మల్, ఆసిఫాబాద్) అటవీ ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, హైదరాబాద్ నిజాం పాలనలోని దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగించిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. 1836 నుండి 1860 మధ్యకాలంలో గోండ్వానా ప్రాంతం కేంద్రంగా బ్రిటీష్, నిజాం పాలకులకు వ్యతిరేకంగా (ఉమ్మడి ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాలు) మర్సికోల్ల రాంజీగోండ్ చేసిన పోరాటాలకు చరిత్రలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదు.
పన్నుల దౌర్జన్యం' – ఆదివాసీల ఆర్థిక రక్షణ
రాంజీ గోండ్ తిరుగుబాటు కేవలం రాజకీయ అధికార మార్పిడి కోసం జరిగింది కాదు. నాటి నిజాం పాలనలోని జమీందార్లు, దొరలు, దేశ్‌ముఖ్‌లు ఆదివాసీలు మరియు స్థానిక రైతులపై మోపిన దౌర్జన్యపూరిత పన్నుల వసూళ్లను అడ్డుకోవడం ఈ పోరాటం వెనుక ఉన్న ప్రధాన సామాజిక-ఆర్థిక కారణం. గిరిజనుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, పంటలపై అధిక పన్నులు రాబట్టడం వంటి చర్యలను రాంజీ తన దళంతో తీవ్రంగా నిరోధించారు. బలవంతపు వసూళ్లను నిలిపివేయించి, పేద ప్రజలకు అండగా నిలవడం ద్వారా ఆయన స్థానికుల గుండెల్లో ఇలవేల్పుగా మారారు.
'జల్, జంగల్, జమీన్' పోరాటానికి మూల బీజం
నైజాం నవాబు అణచివేతపై తర్వాతి కాలంలో కొమురం భీమ్ లేవనెత్తిన చారిత్రక నినాదం 'జల్, జంగల్, జమీన్' (నీరు, అడవి, భూమి) కు అసలు మూల విత్తనం రాంజీ గోండ్ సాగించిన సాయుధ పోరాటమే. తమ అడవిపై, భూమిపై, ప్రకృతి వనరులపై గిరిజనులకే సర్వహక్కులు ఉండాలనే స్పృహను నిర్మల్ గడ్డపై రాంజీగోండే మొదట రగిలించారు. ఈ చారిత్రక తిరుగుబాటే శతాబ్దం తర్వాత వచ్చిన కొమురం భీమ్ వంటి వీరులకు గొప్ప మార్గదర్శకంగా, పోరాట స్ఫూర్తిగా నిలిచింది.
గోండు సంప్రదాయంలో సజీవ చరిత్ర
పాలకులు, ఆంగ్లేయ చరిత్రకారులు ఈ దారుణ మారణకాండను చరిత్ర పుటల్లో ఎక్కించకుండా దాచిపెట్టినప్పటికీ, గోండు తెగల జానపద సంప్రదాయం ఈ వీరగాథను సజీవంగా కాపాడుకుంది. గోండు సమాజంలోని 'తోటీ', 'ప్రధాన్' గాయక కళాకారులు తరతరాలుగా తమ దస్తాన్లు, జానపద గేయాల రూపంలో రాంజీ గోండ్ శౌర్యాన్ని, 'వెయ్యి ఉరుల మర్రి' కింద జరిగిన అమరవీరుల త్యాగాన్ని పాడుకుంటూ వచ్చారు. అధికారిక ఆధారాలు లేని చోట కూడా ఈ నోటిమాట చరిత్రే (Oral History) ఆనాటి నిజాం-బ్రిటిష్ క్రూరత్వాన్ని నేటి తరానికి అందించిన ప్రధాన సాధనమైంది.
వీరుల జ్ఞాపకం చెరిగిపోలేదు
రాంజీ గోండు పోరాటం ఎక్కువకాలం అధికారిక చరిత్రలో పెద్దగా ప్రస్తావనకు రాలేదు. పాఠ్యపుస్తకాల్లోనూ ఆయనకు తగిన స్థానం దక్కలేదనే ఆవేదన గిరిజన వర్గాల్లో ఉంది. అయినప్పటికీ ఆయన పోరాట స్ఫూర్తి ఆదివాసీ హక్కుల కోసం తరువాత జరిగిన ఉద్యమాల చరిత్రలో ప్రతిధ్వనించింది. ముఖ్యంగా కొమురం భీమ్ పోరాటాన్ని గుర్తుచేసుకునే సందర్భాల్లో రాంజీ గోండు వంటి గిరిజన యోధుల త్యాగాలు ప్రస్తావనకు వస్తాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో రాంజీ గోండు, ఆయనతో కలిసి పోరాడిన వీరుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు సంఘాలు కార్యక్రమాలు చేపట్టాయి. 2007 నవంబర్ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2008 నవంబర్ 14న నిర్మల్‌లోని చైన్‌గేట్ వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మర్రిచెట్టు కాలగర్భంలో కలిసిపోయింది.. కాలచక్రం ముందుకు సాగింది. కానీ ఆ మహావృక్షం కింద ప్రాణత్యాగం చేసిన గోండు వీరుల పోరాట స్ఫూర్తి మాత్రం నేటికీ నిర్మల్ నేలపై చెరిగిపోని జ్ఞాపకంగా నిలిచింది.