మయోనైజ్‌పై మరో ఏడాది నిషేధం

మయోనైజ్ ఉత్పత్తి, విక్రయాలు, నిల్వలపై నిషేధం 2027 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
Telangana raw egg mayonnaise ban
పచ్చి గుడ్లతో తయారుచేసే మయోనైజ్‌పై నిషేధాన్ని మరో ఏడాది పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం.
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : పచ్చి గుడ్లతో తయారుచేసే మయోనైజ్‌ ఉత్పత్తి, విక్రయాలు, నిల్వలపై తెలంగాణ ప్రభుత్వం మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ వెల్లడించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006లోని సెక్షన్ 30(2)(a) ప్రకారం ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. 2026 అక్టోబర్ 30 నుంచి 2027 అక్టోబర్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం అమల్లో ఉంటుందని గురువారం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.