8 నెలలుగా వేతనాల్లేవు.. 1,400 మంది ఒకేషనల్‌ ట్రైనర్స్‌ ఆవేదన!

సమగ్ర శిక్షా అభియాన్‌ పరిధిలో పనిచేస్తున్న సుమారు 1,400 మంది ఒకేషనల్‌ ట్రైనర్స్‌కు ఎనిమిది నెలలుగా వేతనాలు అందడం లేదు.
Telangana vocational trainers Protest over pending salaries
ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని తెలంగాణ ఒకేషనల్ ట్రైనర్స్ డిమాండ్.
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్: రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్‌ పరిధిలో పనిచేస్తున్న ఒకేషనల్ ట్రైనర్స్‌కు గత 8 నెలలుగా వేతనాలు అందడంలేదని వృత్తి విద్యా బోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం తెలంగాణ వృత్తి విద్యా బోధకుల సంఘం అధ్యక్షుడు ఇంజం శివకుమార్‌ మాట్లాడుతూ “తెలంగాణలో సుమారు 1400 మంది ఒకేషనల్ ట్రైనర్స్‌ ఉన్నారని, వేతనాలు రాకపోవడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా సంబంధిత అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నా ప్రయోజనం లేదు. వేతనాల ఫైల్‌ ఫైనాన్స్‌ శాఖలో ఉందని అధికారులు చెబుతున్నారు. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో ఒకేషనల్ ట్రైనర్స్ కుటుంబ పోషణకు, ఇంటి అద్దెలు చెల్లించడానికి, ఇతర నిత్యావసర ఖర్చులు భరించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ వారంలోగా పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి. లేనిపక్షంలో నవంబర్‌ మొదటి వారంలో హైదరాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం చేపడతాం” అని ఆయన హెచ్చరించారు.